చిరు చిన్నల్లుడి చిత్రంలో చికెన్ సాంగ్..వీడియో

300
- Advertisement -

రాకేశ్ శ‌శి ద‌ర్వ‌క‌త్వంలో చిరు చిన్న అల్లుడు క‌ళ్యాణ్ దేవ్ హీరోగా తెర‌కెక్కిన చిత్రం విజేత‌. కథానాయికగా మాళవిక నాయర్ నటిస్తోంది. వారాహి చలన చిత్రం బ్యానర్ పై ర‌జ‌నీ కొర్ర‌పాటి నిర్మించిన ఈ చిత్రం జూలైలో విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో చిత్ర యూనిట్ సినిమాపై ఆస‌క్తిని క‌లిగించేలా పోస్టర్స్‌, టీజ‌ర్స్‌, సాంగ్స్ విడుద‌ల చేస్తున్నారు. సినిమా నుండి ఇప్ప‌టికే వ‌చ్చిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్, టీజ‌ర్‌కి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది.

Vijetha Movie

ఇక తాజాగా ఈ మూవీ నుండి కోడికి సంతాపాన్ని తెలియజేస్తూ హీరో పాడే ‘కొక్కొరోకో .. ‘ పాటను రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈ పాటకు సంబంధించి రిలీజ్ చేసిన పోస్టర్ చాలా వెరైటీగా వుంది. చికెన్ షాప్ దగ్గర నుంచుని అలా మారిపోయిన కోడిని తలచుకుని ఏడుస్తూ ఈ పోస్టర్‌లో కల్యాణ్ దేవ్ కనిపిస్తున్నాడు.

ఈ సాంగ్ చూస్తుంటే .. మాస్ ఆడియన్స్ ను అలరించడం కోసం ‘కోడి’ మీద మాంచి మసాలా సాంగ్ పెట్టారని చెప్పాలి. ఈ నెల 24వ తేదీన ఆడియో వేడుకను ఘనంగా జరపనున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారు.

- Advertisement -