టీడీపీ కోసమే పురందేశ్వరి ప్రయత్నామా?

28
- Advertisement -

ఏపీలో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. నిన్నమొన్నటి వరకు అంతర్లీన బంధం కొనసాగించిన వైసీపీ బీజేపీ ఇప్పుడు ఎడమొఖం పెదమొఖంగా ఉంటూ నువ్వా నేనా అన్నట్లు ఘాటైన వ్యాఖ్యలతో రాజకీయ వేడి పెంచుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన పురందేశ్వరి యమ దూకుడుగా వ్యవహరిస్తోంది. సోము వీర్రాజు అధ్యక్షుడిగా ఉన్నప్పుడూ కొంత స్తబ్దంగా కొనసాగైన పార్టీ.. పురందేశ్వరి నాయకత్వంలో కొత్త ఊపు కనిపిస్తోంది. ..ఆమె కూడా పార్టీని జోష్ లో నడిపించేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నాట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అధికార వైసీపీ టార్గెట్ గా ఆమె చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. .

జగన్ పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో చిక్కుకుందని, వైసీపీ పాలనలో అవినీతి రాజ్యామెళుతోందని, వచ్చే ఎన్నికలతో జగన్ ప్రబుత్వానికి ప్రజలు చెక్ పెడతారని ఆమె చేస్తున్న ఘాటైన వ్యాఖ్యలు వైసీపీని కలవర పెడుతున్నాయి. గతంలో సోము వీర్రాజు అధ్యక్షుడిగా ఉన్న టైమ్ లో బీజేపీ చేసే విమర్శలను అసలు పట్టించుకొని వైసీపీ నేతలు ఇప్పుడు పురందేశ్వరి వ్యాఖ్యలపై మాత్రం ఘాటుగా స్పందిస్తున్నారు. రాష్ట్ర అప్పులను ప్రస్తావిస్తున్న పురందేశ్వరి.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ, ప్రత్యేక హోదా అంశం వంటి వాటిపై కూడా ప్రస్తావిస్తే బాగుంటుందని చురకలు అంటిస్తున్నారు వైసీపీ నేతలు.

Also Read:GIC:జ్ఞాపకంలోనూ మరవని స్పూర్తి..ఎంపీ సంతోష్ ప్రశంస

అంతేకాకుండా పురందేశ్వరి చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతోందని ఆమె ప్రయత్నం అంతా చంద్రబాబును అధికారంలోకి తేవడమే అని విమర్శలు గుప్పిస్తున్నారు వైసీపీ నేతలు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా పురందేశ్వరి పై చేసియన్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. బీజేపీ అంటే బాబు జనతా పార్టీ అని, తండ్రి పెట్టిన పార్టీ కోసం మరిది ( చంద్రబాబు ) కళ్ళల్లో ఆనందం చూసేందుకే పురందేశ్వరి ప్రయత్నం అంటూ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా వ్యాఖ్యానించారు. మొత్తానికి నిన్న మొన్నటి వరకు బీజేపీని లైట్ తీసుకున్న వైసీపీ నేతలు పురందేశ్వరి ఎంట్రీతో బీజేపీని కూడా గట్టిగానే డిఫెన్స్ చేయాల్సి వస్తోందనే చెప్పాలి.

Also Read:వామ్మో ప్రభాస్ నాన్ స్టాప్ దూకుడు..?

- Advertisement -