పెళ్లి సందడికి పాతికేళ్లు..

89
pelli sandadi

ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు తెర‌కెక్కించిన అద్భుత చిత్రాల్లో ఒకటి పెళ్లి సంద‌డి. శ్రీకాంత్‌, రవళి, దీప్తి భట్నాగర్‌ హీరోహీరోయిన్లుగా నటించగా అశ్వనీదత్‌, అల్లు అరవింద్‌ నిర్మించారు. జన‌వ‌రి 12,1996లో విడుద‌లైన ఈ చిత్రం నేటితో ఈ చిత్రం 25 ఏళ్ళు పూర్తి చేసుకుంది.

ఈ సంద‌ర్భంగా రాఘవేంద్ర‌ర‌రావు ట్విట్ట‌ర్ ద్వారా సంతోషం వ్య‌క్తం చేసిన దర్శకేంద్రుడు ఈ పాతికేళ్ల #పెళ్లిసందడి సంబరాలను రెట్టింపు చేయడానికి #పెళ్లిసందD సినిమా ని శ్రీకాంత్ వారసుడు రోషన్, శ్రీ లీల తో చేస్తున్నాము.. నా దర్శకత్వ పర్యవేక్షణ లో నా సహాయ దర్శకురాలు గౌరీ దర్శకత్వం చేస్తుంది. ప్రస్తుతం చిత్రీకరిస్తున్నాం… త్వరలో థియేటర్లో కలుద్దాం అంటూ పేర్కొన్నారు.

కీరవాణి స్వరపరిచిన ఈ చిత్రంలోని పాటలు కూడా మంచి ఆదరణ పొందాయి. సౌందర్యలహరి- స్వప్నసుందరి,రమ్యకృష్ణ లాగ ఉంటదా,హృదయమనే కోవెలలో వెలిగే దీపం ,సరిగమ పదనిస రాగం, త్వరపడుతున్నది మాఘం,నవమన్మథుడా అతి సుందరుడా నిను వలచిన ఆ ఘనుడు అనే పాటలు ఇప్పటికి ఎవర్‌గ్రీనే. ముఖ్యంగా కాఫీలు తాగారా, టిఫినీలు చేశారా? ఇంకోసారి కాఫీలు తాగుతారా, ఇంకోసారి టిఫినీలు చేస్తారా? అనే డైలాగ్‌లు ఇప్పటికి ప్రేక్షకులకు గుర్తుండి పోయాయి.