ఇంద్రకీలాద్రిపై మహిషాసురమర్దనిగా దుర్గమ్మ

242
- Advertisement -

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదోరోజు మహిషాసురమర్దనిగా దుర్గమ్మ దర్శనమిచ్చారు. నవరాత్రుల్లో తొమ్మిదో రోజు కావడం వల్ల అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.

మహిషాసురమర్దని అష్ట భుజాలతో అవతరించి సింహవాహినియై దుష్టుడు, లోకకంఠకుడైన మహిషాసురుడిని సంహరించి…దేవతలు ఋషులు మానవుల కష్టాలను తొలగించింది. ఈ అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం వలన సర్వదోషాలు తొలగిపోతాయని…సాత్విక భావం ఉదయిస్తుందనేది భక్తుల నమ్మకం.

మహిషాసురమర్దనిగా ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే ధైర్య స్దైర్య విజయాలు చేకూరుతాయనేది భక్తుల నమ్మకం. అందుకే పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తారు. దసరా ఉత్సవాల్లో పదో రోజైన రేపు రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనిమిస్తారు. రేపటితో ఇంద్రకీలాద్రిపై ఉత్సవాలు ముగియనున్నాయి.

- Advertisement -