‘సరిలేరు నీకెవ్వరు’..తన పాత్రపై క్లారిటీ ఇచ్చిన రాములమ్మ

373
Vijayashanti
- Advertisement -

సుదీర్ఘకాలం పాటు హీరోయిన్‌గా హీరోలకు ధీటుగా నిలబడిన లేడీ సూపర్ స్టార్ విజయశాంతి లాంగ్ గ్యాప్ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు అప్ కమింగ్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. అయితే సినిమాలో విజయశాంతి నెగిటివ్‌ పాత్రలో నటిస్తున్నారని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో తాజాగా విజయశాంతి క్లారిటీ ఇచ్చారు.

Vijayashanti

‘ఇందులో నాది నెగిటివ్‌ పాత్ర కాదు. కీలకమైన పాజిటివ్‌ పాత్ర. నా పాత్రకు మహేశ్‌ పాత్రకు ఎలాంటి సంబంధం ఉండదు. అలాగని నా పాత్ర ఆయనకు ఏమాత్రం తీసిపోదు. దర్శకుడు అనిల్‌ రావిపూడి కథ వినమని వేడుకున్నారు. వినగానే నాకు నచ్చింది. అందుకే క్షణం కూడా ఆలోచించకుండా సినిమాకు సంతకం చేశాను’ అని వెల్లడించారు విజయశాంతి.

ఇందులో రష్మిక మందన కథానాయికగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. 2020 సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్నట్టు.. ఈరోజు విజయశాంతి తన 53వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ చిత్రంలో ఆమె ఇంటి కోసం ప్ర‌త్యేకంగా గ‌చ్చిబౌలిలో 4 కోట్ల‌తో సెట్ వేయించారు నిర్మాత‌లు. ఈ సెట్లోనే త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కానుంది.

- Advertisement -