Vijay Varma:డేటింగ్ రూల్‌ కూడా బ్రేక్ చేశా!

54
- Advertisement -

మిల్కీ బ్యూటీ అనగానే సినీ ప్రేక్షకులకు టక్కున గుర్తొచ్చే పేరు తమన్నా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 20 సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ చెక్కుచెదరని అందంతో అటు నటనతో, ఇటు గ్లామర్‌ తో సినీ ప్రేక్షకులను అలరిస్తోంది ఈ బ్యూటీ. ఇప్పటికీ తమన్నా అందానికి ఫిదా కాని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు.. అందంలోనే కాదు.. డ్యాన్స్‌ లోనూ అప్‌ కమింగ్‌ హీరోయిన్స్‌ కి పోటీగా నిలుస్తోంది తమన్నా.

నాలుగుపదుల వయసుకు దగ్గరవుతోన్న ఈ అమ్మడు ఇంకా పెళ్లి చేసుకోలేదు.. అయితే ఇప్పుడు తమన్నా పెళ్లి హాట్‌ టాఫిక్‌ గా మారింది. తన ఒంటరి జీవితానికి పుల్ స్టాప్ పెడుతూ త్వరలోనే నటుడు విజయ్ వర్మని పెళ్లి చేసుకోనుంది ఈ భామ. ప్రస్తుతం వీరిద్దరు డేటింగ్‌లో ఉండగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు విజయ్ వర్మ.

Also Read:Nagarjuna:హ్యాపీ బర్త్ డే..నాగ్

నిజానికి తాను సినిమా పరిశ్రమకు చెందిన ఏ అమ్మాయిని ప్రేమించకూడదని నియమం పెట్టుకున్నాను. అయితే, తమన్నాను కలిశాక ఎందుకో ఆమెతో ప్రేమలో పడిపోయాను.నా ఆలోచన కూడా మారిందని తెలిపారు. అంతేకాదు అప్పటి వరకూ నేను పెట్టుకున్న డేటింగ్‌ రూల్‌ బ్రేక్‌ చేశాను… తమన్నా అంటే తనకు అంత ఇష్టమని చెప్పుకొచ్చారు. తమన్నాను డైరెక్ట్ గా చూడగానే నాకు అర్థమైంది తనే నా జీవిత భాగస్వామి అని తెలిపారు. లస్ట్ స్టోరీస్‌-2 వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో వీళ్లిద్దరూ ప్రేమలో పడిన సంగతి తెలిసిందే.

Also Read:హ్యాపీ ఓనం..

- Advertisement -