ప్రభాస్ మరో మూవీ రీ రిలీజ్!

47
- Advertisement -

ప్రభాస్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మున్నా. వంశీకి దర్శకుడిగా ఇది తొలి సినిమా కాగా బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌ని సొంతం చేసుకుంది. అయితే ఇందులో ప్రభాస్ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. అయితే తాజాగా ఈ సినిమా రీ రిలీజ్‌కు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ప్రభాస్ నటించిన యోగి రీ రిలీజ్‌ కాగా అంత పెద్ద రెస్పాన్స్ రాలేదు. అయితే తాజాగా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించిన మున్నా రీ రిలీజ్‌కు సిద్ధం కాగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూసే అయినా ప్రేక్షకుల నుండి ఎలాంటి స్పందన వస్తుందనేది వేచి చూడాలి.

హరీష్ జైరాజ్ ఈ చిత్రానికి సంగీతం అందించగా నవంబర్ లో రిలీజ్ కానున్నట్టు టాక్. దీనిపై అఫిషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

Also Read:వెల్లుల్లితో ప్రయోజనాలు!

- Advertisement -