తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. నటుడు విజయ్ స్థాపించిన TVK పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో స్వతంత్రంగా పోటీ చేయాలని పార్టీ వ్యూహరచన చేస్తోంది. ఈ నిర్ణయం ద్వారా తమిళనాడులో తమ బలాన్ని పరీక్షించుకోవాలని విజయ్ భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల రాజకీయాల్లోకి ప్రవేశించిన విజయ్, యువతలో మంచి క్రేజ్ ఉన్న నాయకుడిగా ఎదుగుతున్నారు.
ఇదిలా ఉండగా బీజేపీ… TVKతో పొత్తు కోసం ప్రయత్నించినట్లు సమాచారం. విజయ్‌కు 80 అసెంబ్లీ స్థానాలు, అలాగే డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ చేసినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ ఆఫర్‌ను విజయ్ సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.
ఈ నిర్ణయం తమిళనాడు రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశముంది. ఇప్పటివరకు డీఎంకే, ఎఐఏడీఎంకే పార్టీల మధ్యే ప్రధాన పోటీ ఉండగా, ఇప్పుడు TVK కూడా బలమైన ప్రత్యామ్నాయంగా మారే అవకాశముంది. మొత్తం మీద, విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం తమిళనాడు రాజకీయాల్లో కొత్త మార్పులకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read:మొక్కజోన్న రైతుల కోసం బీఆర్ఎస్ ఆందోళన

