రౌడీ బాయ్‌తో రౌడి భామ!

12
- Advertisement -

రౌడీ బాయ్ విజయ్‌ దేవరకొండతో జతకట్టనుంది రౌడీ భామ సాయిపల్లవి. వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాము అనుకున్నది చెప్పడంలో వీరిద్దరి ప్రత్యేక శైలీ. ప్రస్తుతం సాయిపల్లవి తెలుగు, తమిళ, కేరళ భాషల్లో సినిమాలు చేస్తుండగా విజయ్ పాన్ ఇండియా హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

రవి కిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఒక రూరల్ యాక్షన్ డ్రామా సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో హీరోయిన్‌గా సాయి పల్లవిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. గతంలో ‘డియర్ కామ్రేడ్’ మూవీ లో సాయి పల్లవి నటించాల్సి ఉండగా ఆ సినిమాలో లిప్ లాక్ సీన్స్ ఉన్నాయని ఆమె నో చెప్పింది. మరి ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్టుకు ఓకే చెబుతుందా వేచిచూడాలి. ఇందుకు సంబంధించి అఫిషియల్ ప్రకటన త్వరలో రానుంది.

అలాగే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు విజయ్. ఈ సినిమా చాలా వైవిధ్యమైన కాన్సెప్ట్ తో తెరకెక్కబోతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు.

Also Read:బెండకాయ నీటితో ఉపయోగాలు

- Advertisement -