విలక్షణమైన నటనతో సౌత్ ఇండియాలోనే కాకుండా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి, తన కెరీర్ మరియు రాబోయే ప్రాజెక్ట్‌లపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇటీవల దర్శకుడు నిథిలన్ స్వామినాథన్ తనకు ‘మహారాజా 2’ కథను వినిపించారని, అది తనకు ఎంతగానో నచ్చిందని ఆయన స్పష్టం చేశారు. నిథిలన్ అద్భుతమైన ప్రతిభ ఉన్న దర్శకుడని ప్రశంసించిన ఆయన, మొదటి భాగం ‘మహారాజా’పై ప్రారంభంలో కొందరికి నమ్మకం లేకపోయినా, తాను మాత్రం బ్లాక్‌బస్టర్ అవుతుందని ముందే ఊహించానని గుర్తుచేసుకున్నారు.
మరోవైపు, ‘మహారాజా’ చిత్రం హాలీవుడ్‌లో రీమేక్ కాబోతుండటం గమనార్హం. ఈ హాలీవుడ్ రీమేక్‌లో ప్రముఖ ఆస్కార్ విజేత మాథ్యూ మెక్‌కానగీ (Matthew McConaughey) ప్రధాన పాత్రలో నటించనున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. నిర్మాత ఈ విషయం తనకు చెప్పినప్పుడు ఎంతో థ్రిల్ అయ్యానని విజయ్ సేతుపతి తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన సరదాగా స్పందిస్తూ — “ఒక సినిమాలో ఉచితంగా నటిస్తాను, కానీ ఈ హాలీవుడ్ రీమేక్‌లో నాకు ఒక చిన్న పాత్ర ఇప్పించండి.. అక్కడకి వచ్చి నటిస్తాను” అని నిర్మాతతో అన్నట్లు చెప్పారు. హాలీవుడ్‌లో నటించాలనేది తన డ్రీమ్ అని, ఒక తమిళ చిత్రం ఈ స్థాయికి చేరుకోవడం గర్వకారణమని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
Also Read:మిర్జాపూర్ సక్సెస్‌పై సోనాల్

