తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో ఐదవ రోజైన అత్యంత ప్రాముఖ్యమైన ఘట్టం చోటుచేసుకుంది. ఉదయం శ్రీవారు జగన్మోహిని అవతారంలో పల్లకిపై దర్శనమివ్వగా, రాత్రి స్వామివారి బ్రహ్మోత్సవాలకే ప్రధాన ఆకర్షణ అయిన గరుడ వాహన సేవ అత్యంత వేడుకగా జరగనుంది.
మాడ వీధుల్లో భక్తజన సందోహంసాలకట్ల బ్రహ్మోత్సవాల్లోనే అత్యంత ముఖ్యమైన గరుడసేవను తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తిరుమలకు చేరుకున్నారు. గరుడసేవ దర్శనం కోసం చతుర్మాడ వీధుల్లోని గ్యాలరీల్లో ఇప్పటికే 70 శాతానికి పైగా గ్యాలరీలు భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఔటర్ క్యూ లైన్లతో పాటు మాడ వీధుల గ్యాలరీల్లోకి భక్తులు సులభంగా వెళ్లేలా టీటీడీ (TTD) ప్రత్యేక ప్రవేశ మార్గాలను, డిజిటల్ సూచికలను ఏర్పాటు చేసింది.
భక్తులకు నిరంతర సేవలుమాడ వీధుల గ్యాలరీల్లో గంటల తరబడి వేచి ఉన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ విసృత ఏర్పాట్లు చేసింది.గ్యాలరీల్లో వేచి ఉన్న ప్రతి ఒక్కరికీ నిరంతరాయంగా పాలు, సురక్షిత తాగునీరు, అల్పాహారం మరియు అన్నప్రసాదాలను శ్రీవారి సేవకుల ద్వారా పంపిణీ చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల కోసం గ్యాలరీల వద్ద ప్రథమ చికిత్స కేంద్రాలతో పాటు వైద్య బృందాలు, అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు.
గరుడసేవ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టీటీడీ విజిలెన్స్ శాఖ, జిల్లా పోలీసులు సంయుక్తంగా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాయి. ముఖ్యంగా మాడ వీధుల్లో తోపులాటలు జరగకుండా సీసీటీవీల ద్వారా నిరంతరం నిఘా ఉంచారు. సివిల్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ (CV&SO) సునీల్ కుమార్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ భద్రతా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
Also Read:మిర్జాపూర్ సక్సెస్‌పై సోనాల్

