వైసీపీకి.. విజయసాయి రెడ్డి టెన్షన్?

76
- Advertisement -

ఏపీ రాజకీయాలు రోజుకొక కొత్త మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీలో అంతర్మథనాలు క్రమక్రమంగా పెరిగిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్యేల ధిక్కార స్వరం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఆయా మంత్రులపై వ్యతిరేకత.. ఇలా ఎన్నో సమస్యలు వైసీపీని చుట్టుముట్టాయి. ఇవన్నీ కూడా జగన్ కు తలనొప్పిగా మారాయని చెప్పకతప్పదు. ఇక తాజాగా విజయసాయి రెడ్డి వ్యవహార శైలి కూడా వైసీపీని కలవర పెడుతోందట. మొదటి నుంచి పార్టీ విజయసాయి రెడ్డి కీలక నేతగా ఉన్నారు. వైసీపీలో జగన్ తరువాత ఆ స్థాయిలో విజయసాయి రెడ్డి పేరు ప్రధానంగా వినిపించేది అప్పట్లో. అయితే ప్రస్తుతం విజయసాయి రెడ్డికి పార్టీలో ప్రదాన్యత తగ్గిందనే విమర్శ గట్టిగా వినిపిస్తోంది. .

ఒకప్పుడు పార్టీ వ్యవహారాలలో క్రియాశీలకంగా వ్యవహరించే విజయసాయి రెడ్డి గత కొంతకాలంగా సైలెంట్ అయ్యారు. ప్రస్తుతం పార్టీ పరంగాను ప్రభుత్వం పరంగాను సజ్జల రామకృష్ణరెడ్డి క్రియాశీలకంగా మారారు. అయితే సి‌ఎం జగన్ ఉద్దేశ్యపూర్వకంగానే విజయసాయి రెడ్డిని ఫెడ్ అవుట్ చేసి సజ్జలను హైలెట్ చేస్తున్నారని పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో విజయసాయి రెడ్డి కూడా జగన్ వ్యవహార శైలిపై అసంతృప్తితో ఉన్నారట. ఇదిలా ఉంచితే ఇటీవల తారకరత్న మరణించిన సంగతి తెలిసిందే. తారకరత్నతో విజయసాయి రెడ్డి కి బంధుత్వం ఉండడంతో తారకరత్న అంత్యక్రియల వరకు విజయసాయిరెడ్డి అక్కడే ఉన్నారు. ఆ సమయంలో ఆయన చంద్రబాబుతో ఎంతో సన్నిహితంగా మెలిగారు. దాదాపుగా అరగంట పాటు చంద్రబాబు పక్కనే కూర్చొని మాట్లాడుకున్నారు.

అయితే చంరబాబుపై ఎప్పుడు కూడా నిప్పులు చెరిగే విజయసాయి రెడ్డి.. అంతా సన్నిహితంగా మెలగడం చూసి ఆశ్చర్యం కలగక మానదు. అయితే రాజకీయం వేరు వ్యక్తిగతం వేరు అనునున్నప్పటికి చంద్రబాబు ప్రెస్ మీట్ లో కూడా విజయసాయి రెడ్డి దర్శనమిచ్చారు. దీంతో విజయసాయి రెడ్డి వ్యవహార శైలిపై రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ తెరపైకి వచ్చింది. విజయసాయి రెడ్డికి ప్రస్తుతం వైసీపీ లో తగినంత ప్రదాన్యం లేకపోవడం వాళ్ళ ఆయన పార్టీ మారే అవకాశం ఉందని, అందుకే చంద్రబాబు తో ఆయన సన్నిహితంగా మెలిగారని కొందరి వాదన. ఒకవేళ ఇదేగానుక నిజం అయితే వైసీపీకి భారీ నష్టం కలిగే అవకాశం ఉంది. మొత్తానికి విజయసాయి రెడ్డి వ్యవహార శైలి వైసీపీకి టెంక్షన్ పెడుతోందనే చెప్పాలి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -