ఏపీలో ప్రభుత్వ ప్రతిపక్ష పార్టీల మద్య మరోసారి అగ్గి రాజుకుంది. టీడీపీ, వైసీపీ మద్య నిత్యం ఏదో ఒక వివాదం తెరపైకి వస్తూనే ఉంటుంది. ఈ వివాదాలు కాస్త పెరిగి ఘర్షణల వరకు దారి తీస్తాయి. ఇలాంటి ఘర్షణ రాజకీయాలు ఈ రెండు పార్టీల మద్య కొత్తేమీ కాదు. ఇరు పార్టీల నేతల మద్య పరస్పర ధూషణలు, వ్యక్తిగత విమర్శలు.. ఇప్పటికప్పుడు హాట్ హాట్ చర్చలకు కారణం అవుతుంటాయి. తాజాగా టీడీపీ నేత వెంకన్న మరియు వైసీపీ నేత వల్లబానేని వంశీ మద్య మాటల యుద్దం తారస్థాయిలో వెళ్ళడంతో.. ఇరు వర్గాల మద్య వర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఆ మద్య టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేశ్ పై వల్లబానేని వంశీ ఘాటు విమర్శలు చేశారు. దీంతో వంశీ పై స్థానిక టీడీపీ నేతలు విమర్శలు ఎక్కుబెట్టారు. ఆ విధంగా ఇరు వర్గాల మద్య వివాదం రాజుకుంది.
వంశీ వర్గానికి చెందిన వాళ్ళు గన్నవరంలోని టీడీపీ కార్యలయంపై దాడి చేయడం. ఆ దాడులతో టీడీపీ కార్యకర్తలు ఘర్షణలకు దిగడంతో రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. దమ్ముంటే బెజవాడ ఎన్టీఆర్ సర్కిల్ వద్దకు రావాలని టీడీపీ నేత బుద్దా వెంకన్న వల్లబానేని వంశీకి సవాల్ విసరగా.. మీకు దమ్ముంటే గన్నవరం రావాలని వంశీ వర్గం నుంచి ప్రతి సవాళ్ళు వస్తున్నాయి. ఇలా టీడీపీ వైసీపీ మద్య మరోసారి ఘర్షణ రాజకీయాలు తెరపైకి వచ్చాయి. గన్నవరంలో టీడీపీ పార్టీ కార్యలయంపై దాడి జరగడంతో తెలుగుదేశం నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఇదంతా జగన్ రౌడీపాలనకు పరాకాష్ట అని టీడీపీ అధ్యక్షుడు అచ్చేన్నాయుడు అన్నారు. జరుగుతున్నా ఒక్కో దాడి వైకాపా సమాధికి ఒక్కో ఇటుక అంటూ నారా లోకేశ్ ట్విట్టర్ లో ఫైర్ అయ్యారు. ఈవిధంగా దాడులు జరుగుతున్నా పోలీసులు చుస్తూ ఉండడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అంటూ లోకేశ్ ట్విట్టర్ లో రాసుకొచ్చారు.
గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై వైసీపీ సైకోల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. టిడిపిపై జగన్ రెడ్డి చేయిస్తున్న ఒక్కో దాడి వైసీపీకి సమాధి కట్టే ఒక్కో ఇటుక లెక్క. గన్నవరంలో టిడిపి ఆఫీసుపై వైసీపీ గూండాలు దాడి చేసి, నేతలని కొట్టి, వాహనాలను తగలబెడుతుంటే..(1/3) pic.twitter.com/FXEQEQJEiZ
— Lokesh Nara (@naralokesh) February 20, 2023
ఇవి కూడా చదవండి..

