వైరల్‌..విజయ్, రష్మిక బ్రేకప్?

18
- Advertisement -

హీరో విజయ్ దేవరకొండ – హీరోయిన్ రష్మిక మందన్న రిలేషన్ షిప్‌లో ఉన్నారని కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వీరిద్దరి రిలేషన్‌ షిప్‌కు బ్రేక్ పడిందన్న వార్త వైరల్‌గా మారింది. గతేడాది దీపావళి వేడుకల్ని విజయ్ ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంది రష్మిక. ఆ తర్వాత పలుమార్లు కలిసి వెకేషన్‌కు కూడా వెళ్లారు.

అయితే తాజాగా ఇటీవల రష్మిక తన ఇన్ స్టాలో పెట్టిన ఒక పోస్ట్ నెట్టింట కొత్త రచ్చకు కారణమైంది. తన చెల్లితో, అమ్మతో మాట్లాడినట్లు చెప్పింది. అంతే కాకుండా.. నెటిజన్లకు కొన్ని సలహాలు కూడా చెప్పింది. తన ఫ్యామిలీకి అందరి కంటే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలని రాసుకొచ్చింది. అదే విధంగా మనంఫ్రెండ్ షిప్ చేసే ముందు వాళ్లను తెలుసుకొవాలని.. ఈరోజు మంచిగా ఉన్న వాళ్లు.. రేపు చెడ్డ వాళ్లు కావచ్చు.. మనకు చెడు కూడా చేసే అవకాశం ఉందని తెలిపింది.

అందుకే తల్లిదండ్రుల సలహాలు, సూచనతలతో ముందుకు వెళ్లాలని రష్మిక రాసుకొచ్చింది. దీంతో ఇదంతా విజయ్ గురించేనని టాక్ మొదలు కాగా ఈ పోస్టును నెటిజన్లు వైరల్‌ చేస్తున్నారు.

Also Read:OTT Movies:ఈ వారం ఓటీటీ చిత్రాలివే

- Advertisement -