సగం మంది బాలీవుడ్ నటులు అమ్ముడుపోయారని సంచలన ఆరోపణలు చేశారు నటుడు ప్రకాశ్ రాజ్. ఓ ఇంటర్వ్యూలో పాల్గొని బాలీవుడ్ నటుల మౌనంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని ఎదిరించే ధైర్యం సినీ పరిశ్రమలో చాలామందిలో లేదని, ఎందుకంటే వారు అమ్ముడుపోయారన్నారు.
ప్రభుత్వం ఏదైనా సరే.. చర్చలను అణిచేస్తుంది… ఎవరు ఏ విషయంపై మాట్లాడాలో, మౌనంగా ఉండాలో, అది వారివారి నిర్ణయమేనని తెలిపారు. నా మిత్రుడు ఒకరు నన్ను చూస్తూ చెప్పాడు – ‘ప్రకాశ్ రాజ్ నీకు ధైర్యం ఉంది, నువ్వు మాట్లాడగలుగుతున్నావు అన్నారు.
కానీ నాకు అంత ధైర్యం లేదు అతడి స్థితిని నేను అర్థం చేసుకోగలను కానీ మౌనం కూడా ఓ నేరమేనన్నారు. నేరం చేసినవారిని చరిత్ర క్షమించొచ్చు.. కానీ మౌనంగా కూర్చున్నవారిని మాత్రం క్షమించదని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. ఈ పరిస్థితిలో నాతో కలిసి పని చేస్తే తమకు భవిష్యత్తులో సమస్యలు వస్తాయనే భయం వారికి ఉండవచ్చు కానీ అలా అని చూస్తూ ఊరుకోలేం కదా అన్నారు.
Also Read:శోభన్‌బాబు మనవడు.. గిన్నిస్ రికార్డు!

