బ్యాంకులకు దాదాపు రూ.9వేల కోట్లు బకాయిపడిన కేసులో నిందితుడిగా ఉన్న విజయ్‌మాల్యా లండన్‌లో తలదాచుకున్న విషయం తెలిసిందే. మనీ లాండరింగ్ కేసులో ఆయనను ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు (ఈడీ) మంగళవారం లండన్‌లో అరెస్ట్ చేశారు. మాల్యా అరెస్ట్‌ను సీబీఐ అధికారులు ధ్రువీకరించారు.
ఆయనపై భారత్‌లో మనీలాండరింగ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇటీవలే ఆయన కేసుకు సంబంధించిన పలు ఆధారాలను సీబీఐ, ఈడీ అధికారులు లండన్ లోని న్యాయస్థానానికి అందించారు. విజయ్ మాల్యాను మరోసారి కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. విజయ్ మాల్యాను అరెస్టు చేసిన అంశంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలాఉండగా.. ఇప్పటికే భారత్ జారీ చేసిన లెటర్ ఆఫ్ రెగోరేటరీ ఆధారంగా యూకే పోలీసులు మాల్యాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే అరెస్టయిన మూడు గంటల్లోనే మాల్యాను బెయిల్ పై విడుదల చేసింది లండన్ లోని వెస్ట్ మినిస్టర్ కోర్టు.