జనవరి 13న ‘మాస్టర్’ విడుదల..

38
vijay

తమిళ హీరో విజయ్ నటించిన తాజా సినిమా ‘మాస్టర్’. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం లాక్ డౌన్ కారణంగా ఇన్నాళ్లూ విడుదల కాకుండా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇప్పుడు జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. సాధారణంగా విజయ్ సినిమాలు దాదాపు మూడు గంటల నిడివితో సాగుతాయి.

ఇప్పుడీ చిత్రం రన్ టైమ్ కూడా 178 నిమిషాలకి సెట్ చేశారు. ఇందులో మరో పక్క కథానాయకుడు విజయ్ సేతుపతి విలన్ గా కీలక పాత్ర పోషించాడు. దాంతో సినిమాకి ఆ నిడివి అవసరం అవుతుందని అంటున్నారు. ఈ చిత్రానికి సెన్సార్ నుంచి U/A సర్టిఫికెట్ లభించింది. ఇందులో విజయ్ సరసన మాళవిక మోహనన్ కథానాయికగా నటించింది. ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో కూడా అదే రోజున విడుదల చేస్తున్నారు.