సమంతకు షాకిచ్చిన రౌడీ హీరో..!

93
Vijay Deverakonda
- Advertisement -

విజయ్‌ దేవరకొండ, సమంత హీరోహీరోయిన్లు శివ నిర్వాణ డైరెక్షన్‌లో ఓ చిత్రం తెరకెక్కనుంది. #VD11 అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమాను ఇటీవల ప్రారంభించారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్ర పూజా కార్య‌క్ర‌మాల్లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ క్రమంలో అందురూ ఫోటోలు కూడా దిగారు. అయితే ఈ మూవీ హీరోయిన్‌గా చేస్తున్న సమంత మాత్రం ఈ వేడుకకు రాలేదు.. దాంతో ఎందుకు రాలేదబ్బా అని అందరు అనుకొని వదిలేశారు.

అయితే విజయ్‌ మాత్రం లైట్‌ తీసుకోకుండా.. ఈ మూవీ పూజ ఫొటోను సోషల్‌ మీడియా షేర్‌ చేశాడు. కానీ ఇందులో విజయ్‌ పక్కన సమంత కూడా ఉండటం గమనార్హం. దీంతో ఇది చూసి అంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. ఎందుకంటే ఈ మూవీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సమంత లేకపోయినా విజయ్‌ షేర్‌ చేసిన ఫొటో ఎలా వచ్చిందా? అని చూస్తున్నారు.

ఫోటోను సరిగ్గా పరిశీలిస్తే అర్థమైంది.. అది మార్ఫింగ్‌ చేసిన ఫొటో అని.. కేవలం సమంతనే కాదు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న వెన్నెల కిషోర్‌, రాహుల్‌ రామకృష్ణల ఫొటోలను కూడా విజయ్‌ మార్ఫింగ్‌ చేసి షేర్‌ చేశాడు. ఈ ఫొటోను తన ట్వీటర్‌ ఖాతాలో పంచుకుంటూ.. ‘ఇదే అసలైన పూజ ఫొటో. దీనిని ప్రచురించాల్సిందిగా మీడియాకు నా రిక్వెస్ట్’ అంటూ విజయ్‌ సరదాగా ట్వీట్‌ చేశాడు. అయితే ఇక విజయ్‌ ట్వీట్‌కు స్పందించిన సమంత.. పడి పడి నవ్వుతున్న ఎమోజీలను జత చేసి రీట్వీట్‌ చేసింది. దీందో విజయ్‌ ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

- Advertisement -