పెళ్లి పై షాకింగ్ రిప్లై ఇచ్చిన …విజయ్ దేవరకొండ

422
vijay devarakonda
- Advertisement -

పెళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు..తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డితో ట్రెండ్ సెట్ చేశాడు. అర్జున్‌ రెడ్డితో ఓవర్‌నైట్‌లో స్టార్ డమ్ సొంతం చేసుకున్న విజయ్‌ ఏం చేసినా సెన్సేషనే. అందుకే అతి త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువమంది అభిమానులను సంపాదించుకున్నారు. తాజాగా మే9న విజయ్ బర్త్ డే సందర్భంగా హైదరాబాద్ జంటనగరాలతోపాటు వరంగల్, విజయవాడ, తిరుపతి, బెంగళూరు, చెన్నై, కొచ్చి నగరాల్లో ట్రక్కుల ద్వారా ఐస్‌క్రీమ్‌లని పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు విజయ్‌. ఇంట్లో వాళ్లు పెళ్లి చేసుకోమని బాగా ఒత్తిడి తెస్తున్నారు..అయితే తానేవరికోసమే పెళ్లి చేసుకోనని తనకు నచ్చినప్పుడే పెళ్లి చేసుకుంటానని తెలిపాడు. అయితే తనది మాత్రం ఖచ్చితంగా లవ్‌ మ్యారేజేనని స్పష్టం చేశాడు.

తన మైండ్ లో కొందరు ఉన్నారని .. ఫారెన్ అమ్మాయితో డేటింగ్ లో ఉన్నారా..? అని ప్రశ్నించగా.. ‘మే బీ’ అంటూ బదులిచ్చాడు. ప్రేమ,పెళ్లి విషయంలో తనకు పూర్తి క్లారిటీ ఉందన్నాడు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ…భరత్ కమ్మ దర్శకత్వంలో డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో మరో మూవీ, శివ నిర్వాణ దర్శకత్వంలో మరో సినిమాకు ఓకే చెప్పినట్టు సమాచారం.

- Advertisement -