నేష‌న‌ల్‌వైడ్‌గా ట్రెండింగ్‌లో ‘లైగర్’ ఫస్ట్ గ్లింప్స్..

17

పాన్ ఇండియన్ స్టార్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ మొద‌ల‌య్యాయి. త‌మ అభిమాన హీరోల‌ని సరికొత్త అవ‌తారంలో ప్ర‌జెంట్ చేసే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రాబోతోన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ లైగర్ (సాలా క్రాస్ బ్రీడ్) ఫ‌స్ట్ గ్లింప్స్ ఈ రోజు విడుద‌ల‌య్యింది. విడుద‌లైన క్ష‌ణాల్లోనే ట్రెమండ‌స్ రెస్పాన్స్‌తో నేష‌న‌ల్ వైడ్‌గా ట్రెండింగ్‌లోకి రావ‌డం విశేషం.

ఈ గ్లింప్స్‌లో విజ‌య్‌ దేవ‌ర‌కొండ కండలు తిరిగిన దేహంతో డిఫరెంట్ మెకోవర్, యాటిట్యూడ్‌తో ఆకట్టుకున్నాడు. ఇందులో విజయ్ దేవరకొండను స్లమ్ డాగ్‌గా.. ముంబై వీధుల్లో చాయ్ వాలా నుంచి అంతర్జాతీయ బాక్సర్‌గా ఎదిగినట్లు చూపించారు ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాధ్‌. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కథాంశంతో హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో ‘లైగర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ఫస్ట్ గ్లింప్స్ చూస్తే అర్థం అవుతుంది. ఇందులో ప్రొఫెషనల్ బాక్సర్‌గా కనిపించడానికి విజయ్ దేవరకొండ పడిన శ్రమంతా ‘లైగర్’ గ్లింప్స్‌లో కనిపిస్తోంది.

‘వీ ఆర్ ఇండియన్స్’ అంటూ దేశభక్తిని పెంపొందించేలా తన వాయిస్‌ని గట్టిగా వినిపించాడు. అలానే చివర్లో ‘వాట్ లగా దేంగే’ అంటూ ప్రత్యర్థులకు వార్నింగ్ కూడా ఇస్తున్నాడు రౌడీ బాయ్. మొత్తం మీద ఈ గ్లింప్స్ ఆద్యంతం ఆసక్తికరంగా సినిమాపై అంచనాలు పెంచింది. ఈ సినిమా పూరీ జగన్నాథ్ మరియు విజయ్ దేవరకొండ కెరీర్‌లో త‌ప్ప‌కుండా గుర్తుండిపోయే సినిమా అవుతుంది.

ఫస్ట్ గ్లింప్స్‌లో యాక్షన్ సీన్స్ – బ్యాగ్రౌండ్ స్కోర్ – విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. థాయ్ ల్యాండ్‌కు చెందిన కెచ్చా ఈ సినిమాకు స్టంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీని నిర్వహించారు. ఈ చిత్రానికి జానీ షేక్ బాషా ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తుండగా.. జునైద్ సిద్దిఖీ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా డైనమేట్ మైక్ టైసన్ ఇండియన్ స్క్రీన్ మీదకు పరిచయం కాబోతోన్నారు.

ఈ చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రమ్యకృష్ణ విజ‌య్‌దేవ‌ర‌కొండ అమ్మ‌గా క‌నిపించ‌గా రోనిత్ రాయ్ అతని గురువుగా క‌నిపించారు. ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మ‌ల‌యాళ‌ భాషల్లో విడుద‌ల‌కాబోతుంది. ఈ పాన్ ఇండియన్ మూవీ కోసం టీం అంతా కూడా ప్రాణం పెట్టి పని చేసింది. లైగర్ చిత్రం వచ్చే ఏడాది ఆగస్ట్ 25న విడుదల కాబోతోంది.

నటీనటులు : విజయ్ దేవరకొండ, అనన్య పాండే, రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, విష్ణురెడ్డి, ఆలి, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను

సాంకేతిక బృందం:
దర్శక‌త్వం: పూరి జగన్నాథ్
నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా
బ్యానర్స్: పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్
కెమెరామెన్: విష్ణు శర్మ
ఆర్ట్ డైరెక్టర్: జానీ షేక్ బాషా
ఎడిటర్: జునైద్ సిద్దిఖీ
స్టంట్ డైరెక్టర్: కెచ్చా