వైసీపీ కోవర్టులపై చర్యలు తీసుకోవాలి- ఎమ్మెల్యే రోజా

23

వైసీపీ కోవర్టులపై చర్యలు తీసుకోవాలని చిత్తూరు ఎస్పి సెంధిల్‌కుమార్‌కు నగరి‌ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఫిర్యాదు చేశారు. ఇవాళ చిత్తూరులోని ఎస్పి బంగ్లాలో ఎస్పిని‌ కలిసి విన్నతి‌ పత్రం అందించారు. అనంతరం ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ.. వైసీపిలో ఉంటూ టిడిపితో జత కలిసి పార్టీకి ద్రోహం చేసే వారిని ఉపేక్షించేది‌ లేదంటూ రోజా‌ మండి‌పడ్డారు. ఏపి డిజిపి పోటోలతో అసత్య ప్రచారం చేస్తున్నారని, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో‌ ఫోటోలు తీసుకుని ఫ్లేక్సీలు వేసుకుని అధికారులను బెదిరింపులకు గురి చేస్తున్నారని తెలిపారు..

గతంలో వైసీపిలో సస్పెండ్ అయిన వారు వైసీపి పేరు చెప్పుకుంటూ తిరుగుతున్నారని, వీరిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని చిత్తూరు ఎస్పి సెంధిల్ కుమార్ కి ఫీర్యాదు చేసినట్లు ఆర్కే రోజా‌ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసి,ఎంపిటిసిలు, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.