పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ పార్ట్.. మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ మూవీ పోస్ట్ ప్రోడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. రీ రికార్డింగ్, వీఎఫ్ఎక్స్, డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతుండగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త టీ టౌన్‌లో వైరల్‌గా మారింది.
సినిమా మే 9న కాకుండా నెలఖారుకు వాయిదా పడినట్లు వార్త చక్కర్లు కొడుతుండగా దీనికి సంబంధించిన అఫిషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. అయితే మే చివరి వారంలో విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ విడుదల కానుంది.
పవన్ కెరీర్‌లో వస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం హరిహరవీరమల్లు. అంతేగాదు పవన్ విప్యూటీ సీఎం అయ్యాక వస్తున్న తొలి చిత్రం కావడంతో భారీ హైప్ నెలకొంది. ఈ నేపథ్యంలో ఒకవేళ హరిహర వీరమల్లు రిలీజ్ తేది మే చివరి వారంలో ఉంటే కింగ్డమ్ వాయిదా పడే ఛాన్స్ ఉందట.
Also Read:హైదరాబాద్‌లో టమాటో ఫెస్టివల్

