హైదరాబాద్‌లో టమాటో ఫెస్టివల్

103
- Advertisement -

అవును మీరు చదువుతోంది నిజమే. హైదరాబాద్‌లో టమాటో ఫెస్టివల్ జరగనుంది. ఎక్స్పీరియం ఎకో పార్కులో మే 11న టమాటో ఫైట్ ఫెస్టివల్ జరగనుంది.స్పెయిన్‌లో నిర్వహించే లా టమాటినా స్పూర్తితో ఈ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నారు.

వేల కిలోల టమాటోలను ఒకరిపై ఒకరు విసురుతూ ఆనందిస్తారు. లైవ్ డీజే సంగీతం, నృత్య ప్రదర్శనలు, ఫుడ్ స్టాళ్లు, షాపింగ్ కోసం ఫ్లీ మార్కెట్, ఫన్ జోన్స్ కూడా ఉంటాయి. ఈ ఫెస్టివల్‌లో ఉపయోగించిన టమాటాలను వృథా కాకుండా ఎరువుగా రీసైకిల్ చేసి, రైతులకు అందించనున్నారు.

ఈ ఫెస్టివల్‌కు టికెట్ల ధరలు రూ. 499 నుండి రూ. 3,499 వరకు ఉండనున్నాయని నిర్వహకులు తెలియ జేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం టమాటో ఫెస్టివల్‌లో మీరు కూడా పాల్గొనంది.

Also Read:దేశంపై బాధ్యత లేదా?:సుప్రీం ఫైర్

- Advertisement -