- Advertisement -
పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిందని సంచలన కామెంట్ చేశారు పాకిస్తాన్ మంత్రి బిలావల్ బుట్టో. ఓ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన బుట్టో…పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోషించింది నిజమేనంటూ తెలిపారు.
పాకిస్తాన్‌కు ఉగ్రవాదంతో సంబంధాలు ఉన్నాయని రహస్యంగా భావించట్లేదని బుట్టో తెలిపారు. అయితే ప్రస్తుతం పాక్ శాంతిని కోరుకుంటోందని చెప్పారు.గత అనుభవాల వలన మేము పాఠాలు నేర్చుకున్నాం… ఉగ్రవాద సమస్యను ఎదుర్కొనడానికి అంతర్గత సంస్కరణలు చేపట్టాం అన్నారు.
మేము దాదాపు మూడుదశాబ్దాల పాటు అమెరికా మరియు పాశ్చాత్య దేశాల కోసం ఈ ‘కిరాతక పనులు’ చేశాం. అది పెద్ద తప్పే. దానివల్ల మేమే బాధపడ్డాం అన్నారు.
Also Read:హైదరాబాద్‌లో టమాటో ఫెస్టివల్
- Advertisement -

