అభివృద్ధి పథంలో తెలంగాణ…విజయ్ దేవరకొండ ప్రశంసలు

35
vijay

తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు సినీ హీరో విజయ్ దేవరకొండ. ప్రభుత్వం తీసుకొచ్చిన నూత ఎలక్ట్రిక్ వెహికిల్ పాలసీ విడుదల కార్యక్రమంలో మాట్లాడిన విజయ్ దేవరకొండ… ముఖ్య‌మంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ అద్భుత‌మైన పాల‌సీల‌తో రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతున్నార‌ని పేర్కొన్నారు.

భ‌విష్య‌త్ ఈ వెహిక‌ల్స్‌దే అని అన్నారు. ఎల‌క్ర్టిక్ వెహిక‌ల్స్ వ‌చ్చే జ‌న‌వరి నాటికి అందుబాటులోకి వ‌స్తాయ‌ని, తద్వారా హైద‌రాబాదీల లైఫ్ స్టైల్ మార‌బోతుంద‌ని విజ‌య్ దేవ‌ర‌కొండ స్ప‌ష్టం చేశారు.

త‌మ జిల్లాతో పాటు గ్రామానికి సాగు నీరు వ‌చ్చింద‌న్నారు. 24 గంట‌ల నాణ్య‌మైన ఉచిత విద్యుత్ ఇవ్వ‌డం, సాగునీరు రావ‌డం వ‌ల్ల రైతులు రెండు పంట‌లు వేసుకుంటున్నారు. భూముల ధ‌ర‌లు కూడా పెరిగాయ‌న్నారు. ప‌రిశ్ర‌మ‌లు భారీగా వ‌స్తున్నాయ‌ని తెలిపారు. గ‌తంలో స‌మ‌స్య‌లు వ‌స్తే ప‌రిష్క‌రించేందుకు చాలా స‌మ‌యం ప‌ట్టేది.. ఇప్పుడు ఆ స‌మ‌స్య లేద‌న్నారు. ముందు చూపుతో స‌మ‌స్య‌ల‌ను వీలైనంత త్వ‌ర‌గా ప్ర‌భుత్వం ప‌రిష్క‌రిస్తుంద‌న్నారు.