పదేళ్లలో తెలంగాణలో 2.8 బిలియన్ల పెట్టుబడులు: కేటీఆర్

36
ktr

గత పదేళ్లలో తెలంగాణలో 2.8 బిలియన్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు మంత్రి కేటీఆర్. రాష్ర్ట ప్రభుత్వం రూపొం‌దిం‌చిన నూతన ఎల‌క్ర్టిక్‌ వెహి‌కిల్‌ (ఈవీ) పాల‌సీని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన కేటీఆర్….తెలంగాణ‌ను ఎల‌క్ర్టిక్ వాహ‌నాల హ‌బ్‌గా మార్చ‌బోతున్నామ‌ని, ఎల‌క్ర్టిక్ వాహ‌నాలు ప‌ర్యావ‌ర‌ణ ఫ్రెండ్లీ వెహిక‌ల్స్ అని తెలిపారు.

ఇప్ప‌టికే టీఎస్ ఐపాస్‌, బీఎస్ ఐపాస్ విజ‌య‌వంతం అయ్యాయి. ఎల‌క్ర్టిక్ వాహ‌నాలు కూడా విజ‌య‌వంతం కాబోతున్నాయని చెప్పారు. ఇటీవల కురిసిన భారీ వ‌ర్షాల‌తో హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌తో పాటు రైతులు ఇబ్బందులు ప‌డ్డారు. ప‌ర్యావ‌ర‌ణాన్ని ర‌క్షించాల్సిన అవ‌స‌రం మ‌నంద‌రిపై ఉంద‌న్నారు. కాలుష్యాన్ని అరిక‌ట్టాల్సిన బాధ్య‌త‌ను క‌రోనా మ‌రోసారి గుర్తు చేసింద‌న్నారు.

మ‌హేశ్వ‌రంలో వేల ఎక‌రాలు అందుబాటులో ఉన్నాయి. వెయ్యి ఎక‌రాల్లో ఆటో మొబైల్ త‌యారీ యూనిట్‌ను ప్రోత్స‌హిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. హైద‌రాబాద్‌లో ఎన్విరాన్‌మెంట్ ఫ్రెండ్లీ వాహ‌నాల త‌యారీ, నిర్వ‌హ‌ణ‌కు కంపెనీల‌ను ఆహ్వానిస్తున్నామ‌ని తెలిపారు.

మ‌న వ‌ద్ద పెద్ద ఎత్తున సౌర విద్యుత్ అందుబాటులో ఉంద‌న్నారు. సోలార్ విద్యుత్ ఉత్ప‌త్తిలో దేశంలోనే రెండో స్థానంలో ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు. ఛార్జింగ్ స్టేష‌న్లు, బ్యాట‌రీ త‌యారీ కంపెనీలు పెట్టుబ‌డి పెట్ట‌నున్నాయి. ఎల‌క్ర్టిక్ మ్యానుఫ్యాక్చ‌రింగ్ కోసం అందుబాటులో భూములు ఉన్నాయ‌ని తెలిపారు. హైద‌రాబాద్‌లో పెద్ద ఎత్తున ఎల‌క్ర్టిక్ వాహ‌నాల త‌యారీ యూనిట్లు నెల‌కొల్పుతామ‌ని చెప్పారు. ఐటీ ఉత్ప‌త్తుల ఎగుమతుల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉంద‌న్నారు. ఐటీ రంగంలో జాతీయ స్థాయి కంటే ఎక్కువ అభివృద్ధి రేటు ఉంద‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.