గీతా ఆర్ట్స్‏లో విజయ్ మూవీ టైటిల్ ఇదే..!

289
Vijay Devarakonda
- Advertisement -

తెలుగు చిత్రపరిశ్రమలో చేసినవి తక్కువ సినిమాలే అయినా.. స్టార్ హీరోలకు ఉన్నంత క్రేజ్ సంపాదించుకున్నారు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఆయన అల్లు అరవింద్ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ లో ఓ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాకి శ్రీరస్తు శుభమస్తు డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీరస్తు శుభమస్తుతో గీతా ఆర్ట్స్ కి మంచి విజయాన్ని అందించారు పరశురామ్. దీంతో విజయ్ హీరోగా పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న సినిమాను కూడా గీతా ఆర్ట్స్ బ్యానర్ 2 నిర్మిస్తోంది.

Geetha Arts 2

ఈ సినిమాకు ‘గీత గోవిందా’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇందుకు సంబంధించిన టైటిల్ లోగోని కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో రేపు ఈ సినిమాకి సంబంధించిన ప్రీ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేయనుంది. ఆ తరువాత ఫస్టులుక్ ను వదలనున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కొత్త లుక్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. విజయ్ సరసన ఛలో ఫేం హీరోయిన్ రష్మిక మందన నటించనుంది.

లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గోపీసుందర్ స్వరాలు అందిస్తున్నారు. గోపీసుందర్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని భావిస్తున్నారట. ఇక విజయ్ వరుస సినిమాలతో బిజీగా ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన నటించిన ‘టాక్సీవాలా’ రిలీజ్ సిద్దంగా ఉంది. మరో సినిమా ‘నోటా’ షూటింగ్ జరుపుకుంటోంది.

నా అవార్డును సీఎంఆర్‌ఎఫ్‌కు ఇచ్చేస్తాః విజ‌య్ దేవ‌ర‌కొండ‌

- Advertisement -