తేజ్‌…సెకండ్ సింగిల్ ప్రొమో

264
tej i love u
- Advertisement -

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ – అనుపమ పరమేశ్వరన్‌ కాంబినేషన్‌లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో కె.ఎస్‌.రామారావు నిర్మిస్తున్న చిత్రం ‘తేజ్‌’. ఐ లవ్‌ యు అనేది ఉపశీర్షిక. జూలై 6 ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇటీవలె మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసిన ఆడియోకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. గోపిచంద్ సంగీతం అందించిన ఈ చిత్రం పాటలు యూత్‌,మాస్ ఆడియన్స్‌ను ఉర్రూతలుగిస్తున్నాయి.

‘తొలిప్రేమ’, ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’, ‘డార్లింగ్‌’ వంటి రొమాంటిక్‌ మూవీస్‌ని అందించిన ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో వస్తోన్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. కొంతకాలంగా వరుస పరాజయాలను ఎదుర్కుంటూ వస్తోన్న సాయిధరమ్ తేజ్ కి ఈ సినిమా బ్రేక్ ఇవ్వడం ఖాయమని అంచనా వేస్తున్నారు.

సాయిధరమ్‌ తేజ్‌, అనుపమ పరమేశ్వరన్‌, జయప్రకాశ్‌, పవిత్రా లోకేశ్‌, ప థ్వీ, సురేఖా వాణి, వైవా హర్ష, జోష్‌ రవి, అరుణ్‌ కుమార్‌ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి లిరిక్స్‌: చంద్రబోస్‌, రామజోగయ్యశాస్త్రి, పోతుల రవికిరణ్‌, గోశాల రాంబాబు, స్టంట్స్‌: వెంకట్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: సతీశ్‌, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: మోహన్‌, చీఫ్‌ కో డైరెక్టర్‌: చలసాని రామారావు, ఎడిటర్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, ఆర్ట్‌: సాహి సురేశ్‌, సంగీతం: గోపీ సుందర్‌, సినిమాటోగ్రఫీ: అండ్రూ.ఐ, మాటలు: డార్లింగ్‌ స్వామి, సహ నిర్మాత: వల్లభ, నిర్మాత: కె.ఎస్‌.రామారావు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.కరుణాకరన్‌.

sai dharam tej

- Advertisement -