త్వరలో టీఆర్‌టీ ఫిజిక్స్ రిజల్ట్స్:టీఎస్‌పీఎస్సీ

227
trt results
- Advertisement -

టీఆర్‌టీ భౌతిక శాస్త్రం పోస్టు ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన జాబిత త్వరలో వెల్లడిస్తామని తెలిపింది టీఎస్‌పీఎస్సీ. సీజీజీ పంపిన పత్రాల్లో తప్పులు దొర్లాయని తెలిపారు. పాత జిల్లా కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన కేంద్రాలు ఉంటాయన్నారు. టీఆర్‌టీ స్కూల్ అసిస్టెంట్ ధ్రువ పత్రాలకు అభ్యర్ధుల ఎంపిక పంపిక చేశామని ఒక్కో పోస్టుకు 1:3 చొప్పున ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికచేశామన్నారు. 1809 పోస్టులకు 4989 మంది అభ్యర్థులను ఎంపికయ్యారని తెలిపింది టీఎస్ పీఎస్సీ.

మరోవైపు గిరిజన గురుకుల డిగ్రీ కాలేజీలకు కొత్త పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. గురుకుల డిగ్రీ కాలేజీల్లో 863 పోస్టుల భర్తీకి ,616 లెక్చరర్లు, 15 ప్రిన్సిపాల్ పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. వీటితోపాటు ఆయా గురుకుల డిగ్రీ కాలేజీల్లో ఉన్న ఇతర సిబ్బంది నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

త్వరలోనే వీటికి సంబంధించిన నోటిఫికేషన్, పరీక్షా విధానం షెడ్యూల్ ప్రకటించనున్నారు. వీలైనంత త్వరగానే వీటి భర్తీకి చర్యలు చేపట్టాలని గురుకుల బోర్డును ఆదేశించింది ప్రభుత్వం.

- Advertisement -