లైగర్‌కు అమ్మ రక్ష : విజయ్‌!

50
liger
- Advertisement -

అర్జున్‌ రెడ్డితో మాస్‌ ప్రేక్షకులను అకట్టుకున్న విజయ్‌ దేవరకొండ అనతి కాలంలో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగారు. తాజాగా విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన లైగర్‌ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఆయన చిత్రబృందంతో కలిసి దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఈ మూవీలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 25వ తేదీన విడుదల కాబోతోంది. లైగర్‌ మూవీ చిత్ర ప్రమోషన్స్‌ లో భాగంగా విజయ్‌ దేవరకొండ, హీరోయిన్‌ అనన్యపాండే, దర్శకుడు పూరీ జగన్నాథ్, చార్మిలతో కలిసి భారతదేశం అంతటా విస్తృతంగా పర్యటిస్తున్నారు. సహజంగానే హీరో హీరోయిన్లకు ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఎక్కువగా ఉండే సంగతి మనకు తెలిసిందే. తమ అభిమాన హీరోలు వస్తున్నారని తెలియగానే అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకుని నానా హంగామా సృష్టించిన సందర్భాలు కొకొల్లలు. ఈ నేపథ్యంలోనే తమ పర్యటన సందర్భంగా హీరో విజయ్‌దేవరకొండ తన ట్విట్టర్‌ లో ఆసక్తికర పోస్ట్‌ చేశాడు. తాము సినిమా ప్రమోషన్స్‌ లో భాగంగా దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న నేపథ్యంలో తమ అమ్మ తీవ్రంగా భయపడిపోయిందని, తమకు రక్షణ అవసరమని ఆమె భావించి పవిత్రమైన కంకణాలు కట్టిందని పేర్కొంటూనే దానికి సంబంధించిన ఫోటోలును ట్వీట్‌ చేశాడు. అంతేకాకుండా తన అమ్మ ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతోందని రాసుకొచ్చాడు.

బాక్సింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ మూవీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన లైగర్ ట్రైలర్, పాటలు ఈ చిత్రంపై దేశ వ్యాప్తంగా అంచనాలను భారీ పెంచాయి. మైక్ టైసన్ కీలకపాత్రలలో నటించిన ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -