నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం: సత్యవతి

103
sathyavathi rathood

సైదాబాద్ ఘటనపై స్పందించారు మంత్రి సత్యవతి రాథోడ్. మహబూబాబాద్ జిల్లాలో నూతన మహబూబాబాద్ జిల్లా నూతన సమీకృత కలెక్టర్ కార్యాలయం నిర్మాణం పనులు, మెడికల్ కాలేజీకి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సత్యవతి రాథోడ్…సైదాబాద్ కాలనీలో చిన్నారి చైత్రపై లైంగికదాడి చేసి, హత్య చేయడం దారుణమని, అత్యంత దురదృష్టమన్నారు.

ఈ ఘటన జరిగిన రోజు నుంచి ప్రతి రోజూ డీజీపీ సీపీలతో మాట్లాడుతున్నానని చెప్పారు. పది పోలీస్ బృందాలు నిందితుడి కోసం గాలిస్తున్నాయని, కచ్చితంగా దోషులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మెడికల్ కాలేజీ శంకుస్థాపన, నర్సింగ్ కాలేజీ, కొత్త కలెక్టర్ కార్యాలయం ప్రారంభం చేయడానికి పనులు వేగవంతం చేస్తున్నామని మంత్రి తెలిపారు.జిల్లా అభివృద్ధిలో మీడియా సహకారం కావాలి. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలన్నారు.