రౌడీ హీరో….వెయిట్ లెస్ ఛాలెంజ్‌!

39
vijay devarakonda

అర్జున్‌ రెడ్డితో యూత్‌ ఐకాన్‌గా మారిన హీరో విజయ్ దేవరకొండ. ఈ మూవీ తర్వాత విజయ్‌.. రౌడీ క్లబ్ పేరుతో ఫ్యాషన్‌ బిజినెస్ ప్రారంభించడం పలువురు హీరోలకు దుస్తులను అందజేశారు విజయ్‌. తాజాగా వెయిట్ లెస్‌ ఛాలెంజ్‌ని ప్రారంభించారు విజయ్‌.

ప్రముఖ సెలబ్రిటీ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ కుల్‌దీప్‌ సేథి, సునీతారెడ్డి ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్‌లోని 360డిగ్రీస్‌ ఫిట్నెస్‌లో ఏర్పాటు చేసిన 30రోజుల్లో బరువు తగ్గే ఛాలెంజ్‌ను సోమవారం హీరో విజయ్‌దేవరకొండ ప్రారంభించారు.

ఈ సందర్భంగా విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ రోజురోజుకూ మారుతున్న ఫ్యాషన్‌ను అందిపుచ్చుకోవడంతో పాటు ఫిట్‌నెస్‌పై ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపాలన్నారు. మూడేండ్లుగా తాను ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నానన్నారు. ఆహార నియమాలను పాటిస్తూ సరైన రీతిలో వ్యాయామం చేస్తే బరువుతగ్గడం పెద్ద సమస్య కాదని తెలిపారు.