బీజేపీ నేతల తీరుపై మంత్రి వేముల ఆగ్రహం..

181
Minister Vemula Prashanth Reddy
- Advertisement -

రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బీజేపీ నేతల తీరుపై మంత్రి మండిపడ్డారు. సోమవారం ఆయన బాల్కొండ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి వేముల మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ మీద వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊర్కునేది లేదన్నారు. బీజేపీ నేతలు మీ స్థాయికి మించి మాట్లాడి మా సహనాన్ని పరిక్షించొద్దు. మీ వైఖరి మార్చుకోకుంటే టిఆర్ఎస్ శ్రేణులు గ్రామగ్రామాణ మిమ్మల్ని అడ్డుకుంటారని హెచ్చరించారు. కేసీఆర్‌ను జైల్లో పెట్టేంత ధైర్యం ఉందా.. తెలంగాణను అభివృద్ధి చేస్తున్నందుకు జైల్లో పెడ్తారా అని మంత్రి ప్రశ్నించారు.

రైతులకు సాగునీరు, రైతు బంధు, రైతు భీమా, 24 గంటల ఉచిత కరెంట్, కళ్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్, 2016 రూ. పెన్షన్, రెసిడెన్షియల్ స్కూళ్లలో పిల్లలకు సన్నబియ్యం తో పోషకాహార భోజనం పెడుతున్నందుకు జైల్లో పెడ్తారా..కొత్త బిచ్చగాళ్ల లాగా.. బీజేపీ నేతలు నీతి మాలిన మాటలు మాట్లాడుతున్నారు. ఐదు రోజుల్లో పసుపుబోర్డు తెస్తామని రైతులను మోసం చేసి, రైతు పక్షపాతి కేసీఆర్ ప్రభుత్వం గురించి మాట్లాడుతావ.. ఎంపీ ధర్మపురి అరవింద్‌పై మంత్రి ఫైర్ అయ్యారు. నిన్ను,మీ పార్టీని రైతులు తరిమి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. నీ 12 బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు దమ్ముంటే చూపించు అని మంత్రి సమాల్‌ చేశారు.నీ మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో పెన్షన్ 600 రూ.ఇస్తున్నారు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పంట కొనుగోలు కేంద్రాలు ఉన్నాయా..?రైతుల కోసం మీరు ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాల్లో చేయరు..చేస్తున్న కేసీఆర్‌ను వ్యక్తిగతంగా విమర్శిస్తార.. చేతనైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురా. మిషన్ భగీరథకు నీతి ఆయోగ్ చెప్పినట్లు కేంద్రం నుంచి నిధులు ఇప్పించు అని మంత్రి డిమాండ్‌ చేశారు. మీకు కావాల్సింది రాష్ట్రాభివృద్ధి కాదు..ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టడం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగానికి తెగించిన కేసీఆర్.. రాష్ట్ర అభివృద్ధి కోసం అదే పంథాలో ముందుకెళ్తారు. తెలంగాణ అభివృద్ధి కోసం నిర్మాణాత్మకమైన విమర్శలు స్వాగతిస్తాం… కేసీఆర్‌పై వ్యక్తిగత విమర్శలు చేస్తే చూస్తూ ఊర్కోమని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు.

- Advertisement -