షూటింగ్ లో గాయ‌ప‌డ్డ విజ‌య్ దేవ‌ర‌కొండ‌..

470
vijay Devarakonda
- Advertisement -

విజ‌య్ దేవ‌ర‌కొండ ట్యాక్సీవాలా మూవీ త‌ర్వాత డియ‌ర్ కామ్రేడ్ లో న‌టిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్ధ మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్ధ వారు ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ‌త కొన్ని రోజులుగా ఈ మూవీ షూటింగ్ కాకినాడ‌లో జ‌రుగుతోంది. తాజాగా ఈమూవీ చిత్రిక‌ర‌ణ లో భాగంగా విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌మాదానికి గుర‌య్యాడు. ఒక సీన్లో ఆయన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి వేగంగా మెట్లు దిగివచ్చి కదులుతోన్న ట్రైన్ ఎక్కాలి. అలా పరిగెత్తుకొచ్చి ట్రైన్ ఎక్కబోయిన ఆయన పట్టుతప్పి పడిపోయాడు.

dear comrade

దాంతో అక్కడి సిబ్బంది వెంటనే తేరుకుని ఆయనను పక్కకి లాగేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. విజ‌య్ కి అనుకోకుండా దెబ్బ‌త‌గ‌ల‌డంతో షూటింగ్ లో ఉన్న‌వారంద‌రూ ఒక్క‌సారిగా షాక్ కు గుర‌య్యారు. ప్ర‌మాదం నుంచి బ‌య‌ప‌ట‌పడ్డ త‌ర్వాత విజయ్ ప్ర‌క్క‌నే ఉన్న హోట‌ల్ లో విశ్రాంతి తీసుకున్నాడు. విజయ్ దేవరకొండ ఎడమ చేతికి .. కుడికాలుకి దెబ్బలు తగిలాయి. షూటింగ్ అనంతరం హోటల్ కి చేరుకున్న ఆయన, ఎడమ చేతికి తగిలిన దెబ్బలు చూపిస్తూ .. సోషల్ మీడియాలోఒక ఫోటో పోస్ట్ చేశాడు. ‘లైఫ్ లో ఏదీ ఈజీగా రాదు’ అంటూ ఒక కామెంట్ పెట్టాడు. ఈమూవీలో మెడిక‌ల్ స్టూడెంట్ విజ‌య్ క‌నిపించ‌నున్నాడు.

- Advertisement -