పుష్ప కోసం వెయిటింగ్‌: విజయ్ దేవరకొండ

36
pushpa

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప. మరో రెండు రోజుల్లో సినిమా రిలీజ్ కానుండగా ఫ్యాన్స్ అంతా ఎగ్జయిటింగ్‌గా వెయిట్‌ చేస్తున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ సైతం పుష్ప కోసం వెయిటింగ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ట్రైలర్, పాటలు, విజువల్స్, పెర్ఫార్మెన్స్… అంతా మాస్… నెక్స్ట్ లెవెల్ తెలుగు సినిమా అల్లు అర్జున్ అన్న… రష్మిక మందన్న, సుక్కు సార్‌కి ప్రేమను పంపుతూ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అని విజయ్ దేవరకొండ ట్వీట్‌ చేయగా… దానికి అల్లు అర్జున్ స్పందిస్తూ “ప్రేమకు ధన్యవాదాలు మై బ్రదర్… మేము మీ హృదయాలను గెలుచుకుంటామని ఆశిస్తున్నాము. రియాక్షన్ కోసం వేచి చూస్తున్నాము… శుక్రవారం … తగ్గేదే లే” అంటూ రిప్లై ఇచ్చారు.