తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలయ్య..

34
nbk

తిరుమల శ్రీవారిని అఖండ చిత్ర యూనిట్ దర్శించుకున్నారు.. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో ప్రముఖ సినీ కథానాయకుడు బాలకృష్ణ, చిత్ర దర్శకుడు బోయపాటి శీను,‌ చిత్ర నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డిలు స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా… ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఆలయం వెలుపల నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. అఖండ సినిమాకు ప్రజలు బ్రహ్మరథం పట్టి అఖండ విజయాన్ని అందించారన్నారు.. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ధైర్య సాహసం చేసి విడుదల చేసామని తెలిపారు. సినీ పరిశ్రమకు ప్రేక్షక దేవుళ్ళు ఊపిరి పోసి ధైర్యాన్ని ఇచ్చారని తెలిపారు.. ఆధ్యాత్మిక చింతనతో వచ్చిన సినిమాకు ఘన విజయాన్ని అందించారని చెప్పారు.. ప్రేక్షక దేవుళ్ళకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. శ్రీవారిని దర్శనార్థం తిరుమలకు వచ్చానని అనీ రాజమౌళితో సినిమా ఎప్పుడు అనే ప్రశ్న అప్రస్తుతం మన్నారు.