- Advertisement -
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తుల ప్రవాహం కొనసాగుతోంది. గంగ, యమున, సరస్వతి సదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమం లో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు.
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు ప్రయాగ్ రాజ్‌లో పుణ్యస్నానం ఆచరించగా తాజాగా నటుడు విజయ్ దేవరకొండ కుంభమేళాకు బయలుదేరారు. తన తల్లితో కలిసి కుంభ మేళాకు వెళ్లారు విజయ్.
ఫిబ్రవరి 26 శివరాత్రితో మహా కుంభమేళా ముగియనుంది. 45 రోజులపాటు సాగే ఈ కుంభమేళాలకు దాదాపు 50 కోట్ల మంది హాజరవుతారని యూపీ సర్కార్ అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేసింది.
Also Read:వేసవిలో అద్భుతమైన ఫుడ్, డ్రింక్స్ ఇవే
- Advertisement -

