విజయ్ దేవరకొండ హీరోగా నటించిన డియర్ కామ్రేడ్ చిత్రం జులై 26న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతుంది. విజయ్ సరసన రష్మీక మందన హీరోయిన్ గా నటించింది. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈచిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ సంస్ధ నిర్మించింది. ప్రస్తుతం ఈమూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. ఇటివలే మ్యూజిక్ ఫెస్టివల్ పేరుతో ఈసినిమాపై పుల్ హైప్ క్రియేట్ చేశారు.
అయితే తాజాగా ఈసినిమా ప్రీవ్యూ ను చేశారు బాలీవుడ్ టాప్ నిర్మాత కరణ్ జోహర్. ‘డియర్ కామ్రేడ్’ సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈసినిమా చూసి ఇంప్రెస్ అయ్యానని ట్వీట్ చేశారు. ‘అద్భుతమైన, పవర్ఫుల్ ప్రేమకథ. భరత్ కమ్మ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరణ్ చాలా మంచి సంగీతం అందించారు.
నటీనటుల నటన అత్యుత్తమంగా ఉంది. విజయ్ దేవరకొండ బ్రిలియంట్, రష్మిక బాగా నటించారు. ఈ అందమైన ప్రేమకథను ధర్మా ప్రొడక్షన్స్ సంస్థ రీమేక్ చేయబోతోంది’ అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ, నిర్మాత నవీన్ ఎర్నేని, డైరెక్టర్ భరత్ కమ్మలతో దిగిన ఫొటోలను పోస్ట్ చేశారు. ఈసినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక బాలీవుడ్ లో కూడా విజయ్ తన సత్తాను చాటనున్నాడు.