“వరల్డ్ ఫేమస్ లవర్” గా విజయ్ దేవరకొండ

585
Vijay Devarakodna World Famous Lovers
- Advertisement -

రౌడి హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. కొద్ది రోజుల క్రితమే ఈమూవీ షూటింగ్ ప్రారంభమైంది.కే.ఎస్ రామారావు నిర్మిస్తున్న ఈమూవీలో విజయ్ దేవరకొండ సరసన నలుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. మెయిన్ హీరోయిన్ గా రాశి ఖన్నా నటించగా.. ఐశ్వర్యా రాజేష్, క్యాతరీన్ తెరెసా, ఇసబెల్లాలు నటిస్తున్నారు.

తాజాగా ఈమూవీకి సంబంధించిన టైటిల్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈమూవీకి వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ అనే పేరుని ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఈ నెల 20 సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తామని ప్రకటించింది. నలుగురు హీరోయిన్లతో విజయ్ రోమాన్స్ చేస్తాడని..అందుకే టైటిల్ కు తగ్గట్టుగా అంతమంది హీరోయిన్లను తీసుకున్నారని సమాచారం.

అంతేకాకుండా ఈసినిమాలో విజయ్ దేవరకొండ లవర్ బాయ్ పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. ఈమూవీ తర్వాత విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఈసినిమాకు ఫైటర్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఈసినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

- Advertisement -