స్టన్నింగ్ లుక్‌:వరల్డ్ ఫేమస్ లవర్‌ ఫస్ట్ లుక్

659
varun tej
- Advertisement -

డియర్‌ కామ్రేడ్‌ తర్వాత విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ . కేఎస్‌ రామారావు సమర్పణలో రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, క్యాథరిన్‌ ట్రెసా, ఇజాబెల్లా లెయితే హీరోయిన్లుగా నటిస్తుండగా క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే సినిటా టైటిల్‌తో క్రేజ్ ఏర్పడగా కె.ఎ. వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్ . ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. డియర్ కామ్రేడ్ సినిమాలో క్లాస్ లుక్‌లో కనిపించిన విజయ్….వరల్డ్ ఫేమస్ లవర్‌గా అర్జున్ రెడ్డిని తలపించాడు.

యాంగ్రీగా, గాయాలతో కనిపిస్తాడు. దీంతో విజయ్‌ దేవరకొండ మరోసారి మాస్‌ ప్రేక్షకులను అలరించనున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రానికి గోపీ సుందర్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు.

- Advertisement -