వెండితెరపై వెలిగి రాజకీయ రణరంగంలోకి అడుగుపెట్టిన ఎంజీఆర్, ఎన్టీఆర్ మరియు ప్రస్తుత తమిళనాడు ఎన్నికల్లో సంచలనం సృష్టిస్తున్న విజయ్ తమ తొలి ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకున్నారు.
ఎం.జి. రామచంద్రన్ (MGR):
1972లో డీఎంకే నుండి విడిపోయి ఏఐఏడీఎంకే (AIADMK) పార్టీని స్థాపించిన ఎంజీఆర్, 1977లో జరిగిన తన తొలి అసెంబ్లీ ఎన్నికల్లోనే ఘనవిజయం సాధించారు.ఆ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే కూటమి 130కి పైగా స్థానాలను గెలుచుకుని అధికారంలోకి వచ్చింది.
ఎన్.టి. రామారావు (NTR):
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ‘తెలుగుదేశం’ పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ఎన్టీఆర్ ప్రభంజనం సృష్టించారు.1983లో జరిగిన తన మొదటి ఎన్నికల్లోనే కాంగ్రెస్‌ను ఓడించి, భారీ మెజారిటీతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డు సృష్టించారు.
దళపతి విజయ్ (TVK):
2026 తమిళనాడు ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ ప్రకారం, విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (TVK) తొలి ప్రయత్నంలోనే ప్రజల మనసు గెలుచుకున్నారు.రాష్ట్రంలో డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి బలమైన పార్టీల మధ్య విజయ్ పార్టీ కింగ్ మేకర్‌గా ఎదిగింది.
సినిమా స్టార్లకు ఉండే క్రేజ్ ఓట్లుగా మారుతుందా అనే ప్రశ్నకు ఎంజీఆర్, ఎన్టీఆర్ గతంలోనే సమాధానం ఇచ్చారు. ఇప్పుడు 2026 ఫలితాల్లో విజయ్ కూడా అదే బాటలో పయనిస్తూ తమిళ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు.
Also Read:చాపకింద నీరులా ఫంగల్ ఇన్ఫెక్షన్!

