సిడ్నీ సిక్సర్స్ కోచ్‌గా జేమ్స్ హోప్స్

4
- Advertisement -

ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ జేమ్స్ హోప్స్.. సిడ్నీ సిక్సర్స్ జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. గత తొమ్మిదేళ్లుగా ఆ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన గ్రెగ్ షిప్పర్డ్ స్థానంలో హోప్స్ నియామకమయ్యారు.

జేమ్స్ హోప్స్ గతంలో ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా పనిచేశారు. అలాగే బిగ్ బాష్ లీగ్‌లో హోబర్ట్ హరికేన్స్ జట్టుతో కూడా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. గ్రెగ్ షిప్పర్డ్ సారథ్యంలో సిడ్నీ సిక్సర్స్ వరుసగా టైటిల్స్ గెలవడమే కాకుండా లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు అదే పరంపరను కొనసాగించడం హోప్స్ ముందున్న ప్రధాన సవాలు.

సిడ్నీ సిక్సర్స్ వంటి గొప్ప క్లబ్‌కు కోచ్‌గా వ్యవహరించడం గౌరవంగా భావిస్తున్నాను. ఈ జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు, వారితో కలిసి పని చేయడానికి నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని జేమ్స్ హోప్స్ వ్యాఖ్యానించారు. జట్టులోని యువ ఆటగాళ్లను ప్రోత్సహించడంతో పాటు, హోప్స్ అనుభవం జట్టును తదుపరి స్థాయికి తీసుకెళ్తుందని సిక్సర్స్ యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేసింది.

Also Read:బెంగాల్ గడ్డపై కమలం జోరు..మమతకు షాక్!

ఆస్ట్రేలియా తరఫున హోప్స్ 84 వన్డేలు, 12 టీ20లు ఆడారు. మీడియం పేస్ బౌలింగ్‌తో పాటు లోయర్ ఆర్డర్‌లో మెరుపు బ్యాటింగ్‌కు ఆయన పెట్టింది పేరు. కోచ్‌గా కూడా ఆయన తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

- Advertisement -