అమెరికాలో కేటీఆర్ బిజీబిజీ

190
- Advertisement -

అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బిజీబిజీగా ఉన్నారు. తెలంగాణ అభివృద్ధిలో భాగ‌స్వామ్యులు కావాలంటూ ఎన్నారైల‌కు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇవాళ టీఆర్ఎస్ యుఎస్ఏ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించే సభలో పాల్గొననున్నారు.  సన్నీవేల్ నగరంలోని సంక్రాంతి రెస్టారెంట్లో బుధవారం సాయంత్రం 7.౦౦  గంటల నుండి నిర్వహించనున్న సభలో కేటీఆర్  ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించి ఎన్నారైలను కలవనున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించనున్నారు. రాష్ట్రాభివృద్ధిలో కలిసిరావాలని కోరనున్నారు.

నిన్న సిలీకాన్ వ్యాలీలో పర్యటించిన కేటీఆర్ పలువురు టెకీ దిగ్గజాలను కలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎల‌క్ట్రానిక్ రంగంలో పెట్టుబ‌డులు పెట్టాలంటూ మంత్రి కేటీఆర్ సాన్‌మినా సీనియ‌ర్ మేనేజ్‌మెంట్‌తో చ‌ర్చించారు. సిలీకాన్‌వ్యాలీలోనే మంత్రి కేటీఆర్ అక్క‌డ ఉంటున్న‌ హైద‌రాబాదీల‌ను క‌లుసుకున్నారు. . రాష్ట్ర అభివృద్ధికి ప్ర‌వాస తెలంగాణీయులు క‌లిసి రావాల‌ని ఆయ‌న కోరారు. రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌డుతున్న ప‌థ‌కాల‌కు ఎన్నారైలు కూడా త‌మ వంతు స‌హ‌కారం అందించాల‌ని కేటీఆర్ పిలుపునిచ్చారు.

image

ప్రపంచ పర్యావరణ, నీటి వనరుల సదస్సు సమావేశంలో మంత్రి కెటి రామారావు కీలకోపన్యాసం చేశారు. నీటి యాజమాన్య, సరఫరా, సంరక్షణ అంశాలకు  తెలంగాణ ప్రజల జీవితాలతో వీడదీయలేని అనుబంధం ఉందని తెలిపిన మంత్రి మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి తాగునీటి సరఫరా లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టామని, ఇంతటి భారీ కార్యక్రమాన్ని ఇప్పటిదాకా భారతదేశంలో ఏ రాష్ర్ట ప్రభుత్వం చేపట్టలేదన్నారు.నీటితో పాటు ఇంటీంటికి ఇంటర్నెట్ ఇవ్వడం ద్వారా ప్రతి ఓక్కరికి ప్రపంచంతో అనుసంధానం అయ్యే అవకాశం లభిస్తుందని, తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ద్వారా ఈ హెల్త్, ఈ ఎడ్యుకేషణ్ వంటి రంగాల్లో ఘననీయమైన మార్పు వస్తుందని తెలిపారు.

- Advertisement -