చిరు టైటిల్‌తో వస్తున్న విజయ్‌..!

692
vijay master
- Advertisement -

నూతన సంవత్సరం సందర్భంగా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చాడు ఇళయ దళపతి విజయ్‌. తన కొత్త సినిమా మాస్టర్‌ ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు. తెలుగులో కూడా మాస్టర్‌గానే ప్రేక్షకుల ముందుకువస్తుండగా ఖైదీ దర్శకుడు లోకేష్ కనగరాజు తెరకెక్కిస్తున్నారు.

కార్తీతో తెరకెక్కించిన ఖైదీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో తన నెక్ట్స్ ప్రాజెక్టును సైతం అంతకుమించి భారీ అంచనాలతో తెరకెక్కిస్తున్నాడు లోకేష్. రీసెంట్‌గా అదిరింది, విజిల్ సినిమాలతో హిట్ కొట్టిన విజయ్‌…మాస్టర్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు.

2020 వేసవి కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా ఫస్ట్ లుక్‌తోనే అందుకు తగ్గట్టుగానే అంచనాలను పెంచేశాడు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్టర్‌ మూవీ బాక్సాఫీస్‌ని షేక్ చేయగా తాజాగా అదే టైటిల్‌తో వస్తున్న విజయ్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో వేచిచూడాలి.

- Advertisement -