ఆ సినిమాలో నటించడం…చెత్త నిర్ణయం: నయన్

434
nayan
- Advertisement -

సినిమా సినిమాకు వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ దక్షిణాదిలో లేడి సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న నటి నయనతార. కథల ఎంపికలో జాగ్రత్త వహించే నయన్ తాను చేసిన సినిమాలపై బహిరంగంగానే విమర్శలు చేస్తుంటుంది.

తాజాగా మురుగదాస్-సూర్య కాంబినేషన్‌లో తెరకెక్కిన గజిని సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన కెరీర్‌లో తీసుకున్న అతి చెత్త నిర్ణయం గజనీ సినిమాలో నటించడమేనని తెలిపింది.

సినిమాలో తన లుక్ అంతగా బాలేదని అయితే ఈ విషయంలో తాను ఎవరిని తప్పుబట్టడం లేదన్నారు. అయితే నయన్ వ్యాఖ్యలపై స్పందించాడు మురుగదాస్. కథ డిమాండ్ మేరకు పాత్రల్లో మార్పులు ఉంటాయని గజినీ విషయంలో అదే జరిగిందన్నాడు. ప్రస్తుతం నయన్ నటించిన దర్బార్ జనవరి 9న ప్రేక్షకుల ముందుకురానుంది.

- Advertisement -