రాజకీయాల్లోకి బిచ్చగాడు…!

283
- Advertisement -

గతేడాది తెలుగు సినిమా మార్కెట్లోకి సునామీలా దూసుకొచ్చి సరికొత్త సంచలనాలను సృష్టించిన హీరో విజ‌య్ ఆంటోని. డా.సలీం, నకిలీ సినిమాలతో విభిన్న చిత్రాల హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్, బిచ్చ‌గాడు తో స్టార్ ఇమేజ్ ను టాలీవుడ్ తెచ్చుకొగలిగారు. ఓ వైపు సంగీత ద‌ర్శ‌కుడిగా బిజీగా ఉంటూనే హీరోగా త‌న‌ని తాను సరికొత్తగా ఆవిష్క‌రించుకున్న ఆంటోని .. ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ మార్కెట్లో హాట్ టాపిక్‌ గా మారిపొయాడు. అత‌డు న‌టించిన సినిమా వ‌స్తోంది అంటేనే అదో అటెన్షన్.

Vijay Antony political entry

కథ బలం ఉంటే ఎలాంటి సినిమాలైనా .. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుందనడానికి బిచ్చగాడు మూవీనే ఓ ఉదాహరణ. డబ్బింగ్ సినిమాగా తెలుగులో విడుదలైన బిచ్చగాడు మూవీ అనూహ్యంగా 15 కోట్లు రాబట్టి టాలీవుడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. తాజాగా ఈ మూవీ తిమిళనాట టీవీ ఛానల్ లో ప్రీమియర్ షోగా ప్రసారమై, సీని వర్గాలకు పెద్ద షాకే ఇచ్చింది. తర్వాత విడుదలైన బేతాళుడుతో కూడా హిట్‌ కొట్టి ప్రేక్షకులను మెప్పించాడు.

Vijay Antony political entry

తాజాగా ఈసారి రాజకీయ నాయకుడి అవతారమెత్తాడు. త్వరలోనే యెమన్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గతంలో విజయ్- జీవా శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘నాన్’ బాక్సాఫీస్ వద్ద హిట్ కావడంతో ఈ ఫిల్మ్‌పై అంచనాలు పెరిగాయి. తమిళ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో విజయ్ సరసన మియా జార్జ్ హీరోయిన్‌గా నటిస్తుంది. రీసెంట్‌గా విడుదలైన టీజర్ ఆసక్తిగా వుండడంతో సినీలవర్స్ నుంచి మాంచి స్పందన వస్తోంది.

- Advertisement -