గుర్తింపు లేనిచోట విడిపోవడమే బెటర్..

82
manchu-vishnu

ఏపీకి ప్రత్యేక హోదాపై టాలీవుడ్ నటుడు మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘శాంతియుత పోరాటం వల్లే స్వాతంత్ర్యం వచ్చిందన్న సంగతిని జల్లికట్టు పోరాటం మనకు గుర్తు చేస్తోంది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మనం ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన అవసరం ఉందని విష్ణు అభిప్రాయపడ్డారు. ఆ పోరాటానికి నా నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపిన విష్ణు..దక్షిణాది ప్రజలు నిర్ణయిస్తేనే ఢిల్లీలో ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. కానీ, మనకు మాత్రం ఉత్తరాది నుంచి సరైన గుర్తింపు రావడం లేదు. అలాంటప్పుడు కలిసి ఉంటే లాభం ఏంటి? కాబట్టి ఉత్తరాది, దక్షిణాది ప్రాంతాలను రెండు వేర్వేరు దేశాలుగా విడగొట్టేస్తేనే బాగుంటుంది. సరైన గుర్తింపు రానప్పుడు కలిసి ఉండడం కన్నా విడిపోవడమే బెటర్’’ అని సంచలన కామెంట్స్ చేశాడు విష్ణు. లక్కున్నోడు ప్రమోషన్లలో పాల్గొన్న విష్ణు ప్రత్యేక హోదాపై తన మనోగతాన్ని తెలిపాడు.

manchu-vishnu

ఇక, తన సినిమా గురించి మాట్లాడుతూ..నిర్మాతలు ఖర్చు పెట్టే డబ్బును.. హీరోలు తమ డబ్బులుగా భావించాలని, తన లాంటి రేంజ్ ఉన్న హీరోలపై రూ.30 కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తే అవి ఎలా విజయం సాధిస్తాయని, డబ్బు ఎలా తిరిగి వస్తుందని బడ్జెట్‌పై విమర్శలు సంధించాడు. ఈ కామెంట్ మాట ఎలా ఉన్నా.. విష్ణు దేశ విభజన కామెంట్లపై యువత ఎలా స్పందిస్తుందో మరి.