చెర్రీని టార్గెట్‌ చేసిన అ..ఆ భామ…!

115

అనుపమ పరమేశ్వరన్‌…ఈ హీరోయిన్‌ పేరు ఇప్పుడు టాలీవుడ్‌లో మారుమోగొతుంది. త్రివిక్రమ్‌ దర్శకత్వంలోని అ..ఆ చిత్రంలో నితిన్‌ సరసన నటించింది అనుపమ. ఆ తర్వాత ‘నాగచైతన్య’ తో ప్రేమమ్ రీమేక్ లో నటించి తెలుగు యూత్ కి మరింత దగ్గరైంది ఈ మళయాల బ్యూటీ. ఇటీవలే వచ్చిన శతమానం భవతిలో శర్వానంద్‌ సరసన నటించి మంచి మార్కులు కొట్టెసింది ఈ అమ్మడు. ఇప్పుడు ఈ సినిమా బాక్స్‌ఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈసినిమాలో అనుమమ నటించిన తీరు చాలా అద్భుతంగా ఉందని ఆడియాన్స్‌ చెప్పుకుంటున్నారు.

Anupama Parameswaran Target Ram Charan

అయితే ఇటీవలే రాంచరణ్‌-సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాలో , నాని, వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో రూపొందే సినిమాలోనూ అనుపమ అవకాశం దక్కించుకుందట. కానీ ఈ మళయాలం బ్యూటీకి ఆ ఉత్సాహం ఎంతో సేపు నిలవలేదు. ఆమెను ఈ రెండు ప్రాజెక్టుల నుంచి తప్పించారని టాలీవుడ్‌ వర్గాల ప్రస్తుత సమాచారం.

Anupama Parameswaran Target Ram Charan

అందుకు కారణం మాత్రం ఆమె వరస హిట్లతో దూసుకపోతుండడంతో తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేయటమే అని చెప్పుకుంటున్నారు. అయితే అనుపమను తప్పించి వేరే కొత్త హీరోయిన్‌ కోసం వెతుకుతున్నారని సోషల్‌ మీడియాలో వార్తలు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ విషయంలో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ఇప్పుడు ఆమె చేసిన తాజా ట్వీట్‌ మాత్రం వివాదంగా మారి ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది.

Anupama Parameswaran Target Ram Charan

అయితే ఈ ట్వీట్‌ రామ్‌చరణ్‌ను, సుకుమార్‌ను టార్గెట్‌ చేస్తూ చేసిన ట్వీట్‌లా కనిపిస్తోందంటూ సినీ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. ఇంతకీ ఆమె ఏం ట్వీట్ చేసిందంటే.. ‘ఒక్కసారి నేను వెనక్కి చూసుకుంటే.. గతంలో నేను తిరస్కరణకు గురైన ప్రతీ సందర్భంలోనూ నాకు మంచే జరిగింది. ఇలా తిరస్కరణకు గురైన ప్రతీసారీ నేను మరింత అభివృద్ధి సాధిస్తున్నాన’ని ట్వీట్‌ చేసింది అనుపమ. అయితే ఈట్వీట్‌లో ఉన్న అసలు విషయం తెలియలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.