విజయ్‌తో మరోసారి..

94
- Advertisement -

టాలీవుడ్‌ బ్యూటీ సమంత నాగ చైతన్యతో విడిపోయాక పలు వరుస సినిమాలతో దుసుకుపోతోంది. తెలుగు, తమిళ్‌తోపాటు బాలీవుడ్‌ కూడాలో పలు చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం సామ్‌ ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ రూపొందిస్తున్న ‘శాకుంతలం’ చిత్రం, విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషి’ సినిమాలతో పాటు ‘యశోద’ అనే లేడీ ఓరియోంటెడ్‌ చిత్రంలో నటిస్తోంది.

అయితే తాజాగా ఈ బ్యూటీ తమిళ స్టార్ హీరో విజయ్‌తో నటించే మరో అవకాశాన్ని అందుకుంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ ఓ మూవీ చేయనున్నాడు. ఈ చిత్రంలో సామ్‌ను హీరోయిన్‌గా తీసుకోనున్నాట్లు తెలిస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారికంగా క్లారిటీ రానుంది. ఇప్పటికే విజయ్, సమంత మూడు చిత్రాల్లో కలిసి నటించారు. ఈ చిత్రాలన్నీ హిట్ కొట్టాయి. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో నాలుగో చిత్రం కానుంది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

- Advertisement -