మేజర్… ఫస్ట్ డే కలెక్షన్స్!

79
- Advertisement -

అడవిశేష్‌ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం మేజర్. సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. విమర్శకులు సైతం ప్రశంసలు గుప్పిస్తుండగా సినిమా తొలిరోజు మంచి వసూళ్లను రాబట్టింది.

ఏరియాల వారిగా వసూళ్లను ఓసారి పరిశీలిస్తే…నైజాం – రూ. 1.75 కోట్లు, సీడెడ్ – రూ. 46 ల‌క్ష‌లు, ఉత్త‌రాంధ్ర – రూ. 51 ల‌క్ష‌లు, ఈస్ట్ – రూ. 34 ల‌క్ష‌లు, వెస్ట్ – రూ. 24 ల‌క్ష‌లు, గుంటూరు – రూ. 30 ల‌క్ష‌లు, కృష్ణా – రూ. 28 ల‌క్ష‌లు, నెల్లూరు – రూ. 19 ల‌క్ష‌లు రాబట్టింది. ఓవరాల్‌గా రెండు తెలుగు రాష్ట్రాల‌కు క‌లిపి రూ. 4.07 కోట్లు షేర్ వ‌సూళ్లు చేయగా గ్రాస్ వ‌సూళ్ల‌లో చూస్తే రూ. 6.85 కోట్లుగా ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

క‌ర్ణాట‌క మ‌రియు రెస్పాఫ్ ఇండియా క‌లిపి రూ. 35 ల‌క్ష‌లు రాగా.. హిందీలో తొలి రోజున రూ.35 ల‌క్ష‌లు వ‌చ్చాయి. ఇక ఓవ‌ర్ సీస్‌లో తొలిరోజున రూ. 2.35 కోట్లు వ‌చ్చాయి. మొత్తంగా చూస్తే రూ. 7.12 కోట్లు వ‌చ్చాయి. గ్రాస్ వ‌సూళ్ల‌లో ఇది 13.10 కోట్లుగా తేలింది. సినిమాకు బ్రేక్ ఈవెన్ రావాలంటే ఇంకా రూ.11.88 కోట్లు సమాచారం.

- Advertisement -